Waltair Veerayya Vs  Veera Simha Reddy Third Single 24 Hours stats comparison: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మూడు సాంగ్స్ కి సంబంధించి ఇప్పటికే మంచి రెస్పాన్స్ అయితే లభిస్తోంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ పాటల విషయంలో మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి బాలకృష్ణ మీద స్పష్టమైన డామినేషన్ కనబరుస్తున్నారు. మొదటి పాట విషయంలో 24 గంటల సమయానికి గాను బాస్ పార్టీ సాంగ్ కి 9.51 మిలియన్ వ్యూస్ లభించగా 250.6 కే లైక్స్ లభించాయి, అదే సమయంలో జై బాలయ్య సాంగ్ కి 7 మిలియన్ వ్యూస్ లభించగా లైక్స్ మాత్రం 208 కే లభించాయి.


అలా మొదటి పాట విషయంలో వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డిని డామినేట్ చేశారు. ఇక రెండో సాంగ్ మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి అనే పేరుతో విడుదల కాగా 24 గంటలకు గాను  6.16 మిలియన్ వ్యూస్, 160.3 కే మిలియన్ వ్యూస్ సాధించగా బాలయ్య సుగుణ సుందరి 4.83 మిలియన్ వ్యూస్, 155.2 కే వ్యూస్ సాధించింది. ఇక మూడవ సాంగ్స్ విషయంలో కూడా అదే రిపీట్ అయింది, వీరయ్య టైటిల్ సాంగ్ కి 5.47 మిలియన్ వ్యూస్ లభిస్తే 170.4 కే లైక్స్, బాలయ్య మా మనోభావాలు 5.27 మిలియన్ వ్యూస్ లభించగా 122.9 కే లైక్స్ లభించాయి.


ఒకరకంగా చెప్పాలంటే మూడు సాంగ్స్ విషయంలోనూ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ దాటేసి ముందున్నారనే చెప్పాలి. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మొత్తం మీద డామినేషన్ అయితే ఎక్కువగా చిరంజీవితే కనిపిస్తోంది, ఫైనల్ గా ఎలా ప్రేక్షకులను ఎవరు ఆకట్టుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. 


Also Read: Shraddha Walker-Tunisha Sharma: తునీషా శర్మ సూసైడ్ కు కారణమైన శ్రద్దా వాకర్... షాకింగ్ విషయం బయటపెట్టిన ప్రియుడు!


Also Read: Kajal Aggarwal Lip Kiss: కొడుకు పక్కనుండగానే భర్తకు కాజల్ లిప్ లాక్.. ఫోటో వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook